Ads Top

కడుపుతో ఉంటే నొప్పులు రావా... నోర్మూసుకో.. భర్తతో పడుకునేటప్పుడు తెలీదా...

కడుపుతో ఉంటే నొప్పులు రావా... నోర్మూసుకో.. భర్తతో పడుకునేటప్పుడు తెలీదా...

కడుపుతో ఉంటే నొప్పులు రావా... నోర్మూసుకో.. భర్తతో పడుకునేటప్పుడు తెలీదా...

కడుపుతో ఉంటే నొప్పులు రావా... ఎక్కడి నుంచి వచ్చావు... కాన్పు సమయంలో నొప్పులు రాకపోతే ఇంకేమి వస్తాయి... నోర్మూసుకో... అస్తమానం అరుస్తున్నా వ్‌... భర్తతో ఆ పనిచేసేటప్పుడు తెలీదా.. అని ఆ గర్భిణికి సిబ్బంది నుంచి చివాట్లు ఎదురయ్యాయి.

ప్రసవం కోసం గుంటూరు నుంచి గాంధీ ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆ గర్భిణి భర్త ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినా.. అక్కడ కూడా వారికి ఊరట లభించలే దు. గుంటూరుకు చెందిన రవి శంకర్‌, పి.కవిత (22) దంపతులు, బతుకుదేరువు కోసం కొన్నేళ్ల క్రితం నల్గొండ జిల్లా భునగిరిలో స్థిరపడ్డారు. తొలి కాన్పు కోసం సోమవారంరాత్రి కవితను భర్త గాంధీ ఆస్పత్రికి తీసుకురావడంతో అడ్మిట్‌ చేసుకున్నారు.

అడ్మిట్‌ చేసుకున్న తరువాత ఆమెకు పురిటి నొప్పులు రావడంతో లేబర్‌ వార్డుకు తరలించారు. నొప్పులు భరించలేక అరుపులు పెట్టింది. దీంతో అక్కడున్న సిబ్బంది కవితను కసురుకున్నారు. అసభ్య పదజాలంతో ధూషించారు. కానాలంటే నొప్పులు రాకపోతే ఏం వస్తాయని చివాట్లు పెట్టారు. దీంతో కవిత ఒక వైపు నొప్పులు, మరో వైపు సిబ్బంది మాటలతో కంటతడి పెట్టింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త మంగళవారం ఉదయం సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అక్కడ ఆయననెవరూ పట్టించుకోకపోవడంతో ఆర్‌ఎంఓకు ఫిర్యా దు చేశారు. పురిటి నొప్పలతో వస్తే ఆస్పత్రి సిబ్బంది ఇలా వ్యవహరించి, అసభ్య పదజాలం ఉపయోగించడం సరైంది కాదని భర్త రవిశంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తన భార్యకు రక్తపరీక్షలు చేయడానికి కూడా రెండు వందల రూపాయలను సిబ్బంది వసూలు చేశారని ఆరోపించారు. ల్యాబ్ పరీక్షల పేరుతో ఆస్పత్రిలో దోపిడీ చేస్తున్నారని కవిత భర్త రవిశంక్‌ ఆరోపించాడు.

No comments:

Powered by Blogger.