Ads Top

పాములు పట్టే టాలీవుడ్ హీరో... కొన్ని వందల సార్లు పాము కాటు తింటూ కూడా...

పాములు పట్టే టాలీవుడ్ హీరో... కొన్ని వందల సార్లు పాము కాటు తింటూ కూడా...

పాములు పట్టే టాలీవుడ్ హీరో... కొన్ని వందల సార్లు పాము కాటు తింటూ కూడా...

ఒక్కొకల్లలో ఒక ఇన్నర్ టాలెంట్ ఉంటుంది, రక రకల నమ్మకాలుంటాయి... సామాజికంగా ఎంత ఎదిగినా నచ్చిన అభిరుచిని వదులుకోలేరు. అలాంటిదే హీరో సాయికిరణ్ పాములతో చెలగాటం ఆడే అలవాటు (నువ్వే కావాలి లో అననగనగా ఆకాశం పాట ఫేం). చిన్నప్పటినుంచీ పాములంటే సాయి కిరణ్ కి భయం లేదట.

భయం లేకపోతే పోయే శివుడంటే ఉన్న భక్తి వల్ల వాటి మీద ప్రేమకూడా ఎక్కువే ఉందట. దాంతో పాములని కాపాడే భాధ్యత బుజాన వేసుకున్నాడు... ఇదిగో లేటెస్ట్ గా ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాయి కిరణ్ చెప్పిన పాములు పట్టిన సంగతులు...

వానపాములు:
చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు.. చెట్లకు వానపాములు ఎంత మేలు చేస్తాయో మా సైన్స్ టీచర్ చెప్పారు. చెట్ల మొదళ్లలో వాటిని వేయాలని చెప్పారు. దీంతో ఒక రోజు ఇంటి దగ్గర వానపాములను పట్టి చెట్లకు వేస్తున్నాను. అప్పుడే వానపాము అనుకుని చిన్న త్రాచు పామును పట్టుకున్నాను.

కరిస్తే చచ్చిపోతావు:
అదేమో నా వేలుకు చుట్టుకుని బుసలు కొడుతోంది. చెట్టు మొదలు వద్ద పెట్టి మట్టి కప్పేసినా.. మళ్లీ బయటకు వచ్చేస్తోందది. దీంతో దానికి నన్ను వదిలి వెళ్లడం ఇష్టం లేదేమోననుకుని.. మళ్లీ దానిని పట్టుకున్నాను. ఇంతలో మా ఇంట్లో వాళ్లొచ్చి దానిని కింద పడేసి చంపేశారు. అదేంటో తెలుసా..? కరిస్తే చచ్చిపోతావు అని చెప్పేవరకు నాకు అది పామని తెలియదు.

పెద్ద త్రాచుపాము:
కానీ, ఆ పాముని చంపినప్పుడు చాలా బాధేసింది. అదేం చెయ్యలేదు కదా. తప్పు మనదేనేమో.. వాటిని అనవసరంగా చంపుతున్నామని అనిపించింది. ఇక, ఇంకోసారి స్కూలు నుంచి వస్తుండగా.. రోడ్డుపై ఓ పెద్ద త్రాచుపాము చుట్టూ జనం మూగారు. దాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ పామును చంపేశారు:
నేను వెళ్లి ఆపాను. ఎందుకు చంపుతున్నారని ప్రశ్నించాను. అయితే.. నువ్వెళ్లి పట్టుకో అనడంతో ముందుకెళ్లాను. బుసలు కొడుతూ మీదకొస్తుండడంతో పక్కనున్న ఓ వ్యక్తి నన్ను లాగేశాడు. ఆ తర్వాత వాళ్లంతా ఆ పామును చంపేశారు. అప్పుడు ఇంకా చాలా బాధేసింది.

పాములు నన్ను కరిచాయి:
అందుకే సైనిక్‌పురిలో ఉండే పాములను సంరక్షించే ఓ సంస్థలో శిక్షణ తీసుకున్నాను. పాములు పట్టుకోవడం నేర్చుకున్నాను. అప్పట్నుంచి 3 వేల పై చిలుకు పాములను పట్టాను. చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్, నాగబాబు వంటి ప్రముఖుల ఇళ్లలో పాములు పట్టాను.

3000 పైనే :
అన్నపూర్ణ స్టూడియోస్‌లో రెండు సార్లు పాముల్ని పట్టుకున్నాను. అలా పాముల్ని పట్టుకున్నప్పుడు కొన్ని వందల సార్లు పాములు నన్ను కరిచాయి కూడా. కానీ, విషపూరిత సర్పాలు కరిసింది మాత్రం ఒక్కసారే'' అని చెప్పాడు. ఇప్పటివరకూ మనోడు రక్షించిన పాముల సంఖ్య ఎంతో తెలుసా??? 3000 పైనే నట...
Make money from your Website or Blog with BidVertiser

No comments:

Powered by Blogger.